: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు


ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 20వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఈ మేరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కొద్దిసేపటి కిందటే మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమయంలోనే నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 12 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు.

  • Loading...

More Telugu News