: టెక్స్ట్ కమాండ్స్ తోనూ ఫొటోలు ఎడిట్ చేయొచ్చట!


ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే, ఆ ఇక్కట్లను తమ నూతన సాంకేతిక పరిజ్ఞానం తొలగిస్తుందంటున్నారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ పరిశోధకులు. ఫొటోల్లోని ఫీచర్స్, సీజన్లు, టైమ్ మరియు డేట్ మార్చాలంటే తాము రూపొందించిన కొన్ని సింపుల్ కమాండ్స్ అప్లై చేస్తే సరి అని అసిస్టెంట్ ప్రొఫెసర్ జేమ్స్ హేస్ తెలిపారు. ఉదాహరణకు జులై నెలలో తీసిన ఓ ఫొటోని ఎడిటింగ్ చేసే క్రమంలో 'మోర్ వింటర్' అన్న కమాండ్ అప్లై చేస్తే... ఆ ఫొటోలో మరింత మంచు కనిపిస్తుందట. తద్వారా ఆ ఫొటో జనవరిలో తీసిన ఎఫెక్ట్ వస్తుందని బ్రౌన్ వర్శిటీ పరిశోధక బృందం తెలిపింది. ఇందుకోసం 40 రకాల వాతావరణ మార్పులకు సంబంధించిన కమాండ్స్ ను రూపొందించారట. ఈ సందర్భంగా హేస్ మాట్లాడుతూ, ఫొటోషాప్ లాంటి సాఫ్ట్ వేర్లు నిజంగా సమర్థవంతమైనవే అయినా, వాటిని ఉపయోగించాలంటే నిపుణులు అవసరమని అభిప్రాయపడ్డారు. తమ టెక్స్ట్ కమాండ్స్ తో సాధారణ వ్యక్తులు కూడా ఫొటోలను నచ్చిన రీతిలో ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News