: నేతాజీకి భారతరత్న అంశాన్ని తప్పుబట్టిన ఆయన మనవడు


భారతరత్న పురస్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరును కూడా పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారాన్ని నేతాజీ మనవడు, ప్రముఖ చరిత్రకారుడు, టీఎంసీ ఎంపీ సుగతా బోస్ తప్పుబట్టారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ భారతరత్న పురస్కారం కంటే ఎక్కువ అని తెలిపారు. వీరిద్దరినీ భారతరత్న కంటే ఎగువ స్థాయిలో ఉంచాలని కోరారు. రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చిన తర్వాత బోస్ కు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చరిత్రపై అవగాహన ఉన్నవారెవరైనా తనతో ఏకీభవిస్తారని ఆయన అన్నారు. మనం నేతాజీ భావజాలాన్ని గౌరవిస్తే చాలని చెప్పారు. నేతాజీకి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన చేయరాదని... ఆయన మరణం మిస్టరీని ఛేదిస్తే చాలని అన్నారు.

  • Loading...

More Telugu News