: త్వరలోనే విశాఖపట్నం క్రికెట్ స్టేడియంకు టెస్టు హోదా: ఎన్.శ్రీనివాసన్
సుందర నగరం విశాఖ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. పలు వన్డేలకు ఇప్పటి దాకా ఆతిథ్యం ఇచ్చిన విశాఖ క్రికెట్ స్టేడియంకు త్వరలోనే టెస్టు హోదా దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఐసీసీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. ఆంధ్ర క్రికెట్ సంఘం వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, టెస్టు మ్యాచ్ లు నిర్వహించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు విశాఖ స్టేడియంకు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఆంధ్ర క్రికెట్ సంఘం నుంచి క్రికెటర్లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని అభిలషించారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ తాత్కాలిక ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెనాయుడు కూడా హాజరయ్యారు.