: ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచిన పాక్
నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ పాటించాలంటూ చేసుకున్న ఒప్పందానికి పాకిస్థాన్ పదేపదే తూట్లు పొడుస్తూనే ఉంది. తాజాగా, పాక్ దళాలు జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఆదివారం నాడు కాల్పులకు తెగబడ్డాయి. పాక్ సైనికులు మెంధర్ సెక్టార్లోని భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. దీంతో, భారత బలగాలు దీటుగా స్పందించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు.