: సర్వే... దొంగ రేషన్ కార్డుల ఏరివేతకైతే ఫర్వాలేదు: సీపీఎం రాఘవులు
ఢిల్లీలో సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు ముగిశాయి. అనంతరం సీపీఎం నేత బీవీ రాఘవులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే దొంగ రేషన్ కార్డుల ఏరివేత వరకైతే ఫర్వాలేదని... పేద, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వ పథకాలకు దూరం చేసేందుకైతే మంచిదికాదని అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఉండాలని రాఘవులు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. గవర్నర్ కు అధికారాలపై ఉభయ సభల్లో చర్చ కూడా జరిగిందని రాఘవులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.