: సోషల్ మీడియాను ఊపేస్తున్న హృతిక్ కొత్త సినిమా... 24 గంటల్లో 20 లక్షల హిట్లు


హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్ లో టీజర్ విడుదల చేసిన 24 గంటల్లోనే 20 లక్షల హిట్లు సొంతం చేసుకుంది. దీనిపై ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హృతిక్ రోషన్ స్పందిస్తూ, 58 సెకన్ల పాటు అభిమానులను అలరించినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. టామ్ క్రూయిజ్, కెమెరాన్ డియాజ్ నటించిన హాలీవుడ్ సినిమా 'నైట్ అండ్ డే' సినిమా కు ఫ్రీమేక్ 'బ్యాంగ్ బ్యాంగ్'. ఈ సినిమాలో హృతిక్, కత్రినా మూడోసారి జతగా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News