: ఈసారి బ్యాట్స్ మెన్ పై మండిపడ్డాడు!
సౌతాంప్టన్ టెస్టులో ఓటమికి బౌలర్లను తప్పుబట్టిన టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టు పరాజయంలో బ్యాట్స్ మెన్ ను నిందిస్తున్నాడు. మరీ మూడు రోజుల్లోనే ఈ టెస్టు ముగియడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ధోనీ, టాపార్డర్ ప్రదర్శనను తూర్పారబట్టాడు. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, "టాపార్డర్ బ్యాట్స్ మెన్ అన్న తర్వాత పరుగులు సాధించడం ఎంతో ముఖ్యం. వారికంటే 7,8,9,10,11 స్థానాల్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఎంతో నయం" అని విమర్శించాడు. తమ ఉన్నతశ్రేణి బ్యాట్స్ మెన్ కంటే ఐదో బౌలర్ ఎక్కువ పరుగులు సాధించాడని ధోనీ వ్యంగ్యం ప్రదర్శించాడు. ఈ పరాభవం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నాడు.