: పవన్ వల్ల టీడీపీకి అధికారం... చిరంజీవి వల్ల కాపులకు గుర్తింపు: మంత్రి మాణిక్యాలరావు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారం వల్లే టీడీపీ అధికారంలోకి రాగలిగిందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాతే... రాష్ట్ర రాజకీయాల్లో కాపులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దూడుకు స్వభావంతో, దాడులు చేసే వారిగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.