: త్వరలోనే మోడీని కలుస్తాం: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదుపై గవర్నర్ పెత్తనాన్ని సహించమని టీఎస్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే మోడీని కలుస్తామని... అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. దళిత యువతుల పెళ్లిళ్లకు ఆర్థికసాయం అందించడానికి ప్రారంభించిన కళ్యాణలక్ష్మి పథకాన్ని... త్వరలోనే మైనారిటీ యువతులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు. ఇవాళ ఆయనకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు రాఖీ కట్టారు.