: మాట ఇచ్చి మోసం చేయడం కేసీఆర్ నైజం: ఎర్రబెల్లి


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. విభజన సమయంలో గవర్నర్ అధికారాలపై చర్చిస్తున్నప్పుడు అడ్డుకోకుండా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజ్ నాథ్ ఇంటికి వెళ్లినప్పుడు గవర్నర్ అధికారాలు కేసీఆర్ కు గుర్తుకు రాలేదా? అని అన్నారు. సోనియా ఇంటికి వెళ్లినప్పుడు బిల్లులోని లోపాలు ఆయనకు తెలియవా? అంటూ చురక అంటించారు. అప్పుడు బిల్లు పాస్ చేయించుకుని ఇప్పుడు కొత్త నాటకాలు ఆడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుండటం ఏమిటని నిలదీశారు. అప్పుడేమో సంబరాలు చేసుకున్నారని... ఇప్పుడేమో విమర్శలకు దిగుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. మాట తప్పడం... మాట ఇచ్చి మోసం చేయడం కేసీఆర్ నైజమని ఎద్దేవా చేశారు. కావాలనే తమ అధినేత చంద్రబాబును టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ తీరువల్ల తెలంగాణ ఎంతో నష్టపోతుందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ కు సంబంధించిన వాస్తవాలను గ్రహించాలని సూచించారు.

  • Loading...

More Telugu News