: నాంపల్లిలోని జిరాక్స్ సెంటర్ నుంచి జగన్ ఆర్బీఐకి దొంగఫ్యాక్స్ లు పంపుతున్నాడు: దేవినేని


రిజర్వ్ బ్యాంక్ కు వైసీపీ దొంగలేఖలు పంపిస్తోందని ఆంధ్రప్రదేశ్ భారీనీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు చాలా బాగున్నారని... కొన్నేళ్లుగా వారికి వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు రాలేదని ఆర్బీఐకి అబద్ధపు లేఖలు పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు బాగున్నాయని కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయంటూ... వాటి నకళ్లను జగన్ నాంపల్లి లోని ఓ జిరాక్స్ కేంద్రం నుంచి ఆర్బీఐకు ఫ్యాక్స్ లు పంపారని దేవినేని ఉమ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం రుణమాఫీ నిర్ణయాన్ని అమలు చేస్తుండడం చూసి తట్టుకోలేకే జగన్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. జగన్ దొంగతనంగా ఆర్బీఐకు లేఖలు పంపాల్సిన అవసరం లేదని... డైరక్ట్ గా సాక్షి టీవీ, పేపర్ ద్వారా పంపొచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News