: మోడీకి లేఖ రాసిన కేసీఆర్
ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలు కల్పించే విషయంపై పునరాలోచించాలని లేఖలో కేసీఆర్ కోరారు. కేంద్ర హోంశాఖకు తమ ప్రభుత్వం తరఫున రాసిన లేఖను పరిశీలించి... తదుపరి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమరి ఆమోదం లేకుండానే హోంశాఖ లేఖ రాసిందని తాను భావిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నర్ కు అధికారాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని... ప్రజాస్వామ్య సాంప్రదాయాలను కాపాడతారని భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు.