: భారత్ తో పాక్ సంబంధాలపై నవాజ్ షరీఫ్ విచారం


పొరుగు దేశం భారత్ తో పాకిస్థాన్ కు సరైన సంబంధాలు లేకపోవడంపై ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మంచి సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్ లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో షరీఫ్ ప్రసంగించారు. పొరుగు దేశాలతో పాక్ కు మంచి సంబంధాలు లేకపోవడంపై ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో జరిగే విదేశీ కార్యదర్శుల సమావేశం... పొరుగు దేశాలతో సంబంధాలను ముందుకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News