: కాందహార్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ భారీ సాయం


కాందహార్ నగరంలో క్రికెట్ స్డేడియం నిర్మించుకోవాలన్న ఆఫ్ఘనిస్తాన్ కలలకు భారత్ ప్రోత్సాహం ఇచ్చింది. ఈ మేరకు స్డేడియం నిర్మాణానికి ఒక మిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ విషయంలో భారత్ ఇచ్చిన ప్రేరణపై స్పందించిన ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.నూర్ మొహమ్మద్ మురద్, ఇది తమకు ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబారి అమర్ సిన్హా... మురద్ కు రాసిన లేఖను ఏసీబీ విడుదల చేసింది. "కాందహార్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత ప్రభుత్వం ఒక మిలియన్ డాలర్ ప్రకటించడం పట్ల ఏసీబీ చీఫ్ గా మీరు చాలా సంతోషపడతారు" అని లేఖలో ఉంది. అయితే, క్రికెట్, ఫుట్ బాల్ ఆటలతోనే ఇరు దేశాల యువతను ఉత్సాహపరచవచ్చని, అంతకంటే మించింది ఏదీలేదని నిర్ణయానికొచ్చామని లేఖలో పేర్కొన్నారు. అటు దీనిపై ఆ దేశ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఓ ఆంగ్ల చానల్ తో మాట్లాడుతూ, భారత్ తమకు ప్రకటించిన సాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాక ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పట్ల భారత్ చూపుతున్న నిరంతర నిబద్ధతను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఇండియాతో తమకు గొప్ప చారిత్రాత్మక స్నేహం ఉందని, దీనికి ఆఫ్ఘన్ లు చాలా విలువ ఇస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News