: మిజోరం గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన వీకే దుగ్గల్
మిజోరం గవర్నర్ గా వీకే దుగ్గల్ ఈ రోజు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మణిపూర్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి దాకా గవర్నర్ గా వ్యవహరించిన కమలా బేణీవాల్ ను తొలగించిన నేపథ్యంలో ఆయన అదనపు బాధ్యతలు చేపట్టారు. గౌహతి హైకోర్టు ఐజ్వాల్ పర్మినెంట్ బెంచ్ సిట్టింగ్ జడ్జి జస్టిస్ ఎల్ఎన్ జమీర్ ఆయనచే ప్రమాణం చేయించారు.