: భారత్ హామీ ఇస్తేనే ఎంఎఫ్ఎన్ హోదా: పాక్


భారత్ కు ఎంఎఫ్ఎన్ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్- అత్యంత అనుకూల దేశం) హోదా ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తాజాగా స్పందించింది. మార్కెట్ ప్రవేశ సౌలభ్యం, పన్నులు, పన్నేతర అడ్డంకుల విషయంలో తమ ఆందోళనపై ఇండియా తమకు సానుకూల హామీ ఇవ్వాలని భారత్ లో పాక్ హైకమిషన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరింది. భారత్ తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల సమానావకాశాలు లభించే పరిస్థితి ఏర్పడాల్సి ఉందని కూడా కమిషనర్ అబ్దుల్ బాసిత్ స్పష్టం చేశారు. వెంటనే స్పందించిన భారత్, పాక్ కు 1996లోనే భారత్ ఆ హోదా ఇచ్చిందని గుర్తు చేసింది. అసలు వాణిజ్య రంగంలో పరస్పర వృద్ధికి ముందడుగు వేయాల్సిందే పాకేనని పేర్కొంది. అటు ఈ నెల 25న విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News