: కేసీఆర్ ది ప్రాంతీయ తీవ్రవాదం... తెలంగాణవారమనే చెప్పండి: మంత్రి రావెల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది ప్రాంతీయ తీవ్రవాదమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో స్థిరపడిన ప్రతివారూ తాము తెలంగాణవారమేనని చెప్పాలని పిలుపునిచ్చారు. అలా చెప్పకపోతే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సర్వే ఫార్మాట్ లోని ఏ రాష్ట్రం నుంచి వచ్చారనే కాలమ్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన అన్నారు. 1956 తరువాత వచ్చి స్థిరపడిన వారు స్థానికేతరులనడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వెల్లడించారు. కేసీఆర్ చట్టాలు చదివితే బాగుంటుందని సూచించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర మేధావులు స్థానికత విషయంపై భారత చట్టాలు ఏం చెబుతున్నాయో చెప్పాలని విజ్ఞప్తి చేశారు.