: నేడు వైసీపీకి రాజీనామా చేయనున్న ఎమ్మెల్సీ జూపూడి
ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ఈరోజు (శనివారం) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూపూడి.. వైఎస్ మరణానంతరం జగన్ కు అండగా నిలబడి వైసీపీలో చేరారు. తర్వాత పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.