: హైదరాబాద్ పై అధికారం గవర్నర్ కు అప్పగించడంపై వీహెచ్ సూటిప్రశ్న
హైదరాబాదులో శాంతిభద్రతలు గవర్నరుకు అప్పగిస్తే సీఎం, హోంమంత్రి ఏం చేయాలి? అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఇక్కడి సెటిలర్లకు ఇబ్బంది కలిగితే గవర్నర్ జోక్యం చేసుకుంటే బావుంటుందని సూచించారు. అంతేకానీ, ప్రతి విషయంలో గవర్నర్ జోక్యం అవసరం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ కు ఊపులేదని, ఈ సమయంలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తే బావుండదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. అటు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిలో పొన్నాలను మారుస్తారో లేదో దిగ్విజయ్ ను అడగాలని ఆయన చెప్పారు.