: దెందులూరులో రోడ్డు ప్రమాదం... ఇద్దరి మృతి
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దెందులూరు ఎస్సై వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.