: రెండో రోజూ విజయవంతంగా సాగిన మెట్రోరైలు ట్రయల్ రన్
హైదరాబాదు మెట్రోరైలు రెండో రోజూ పట్టాలపై పరుగులు తీసింది. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ట్రయల్ రన్ ను శుక్రవారం ఉదయం 11.21 నిమిషాలకు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ (ఉప్పల్) నుంచి నాగోల్ జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో మొత్తం 3 ట్రిప్పులు నడిపారు. పట్టాలపై పరుగులు తీస్తున్న మెట్రో రైలును నగరవాసులు ఆసక్తిగా తిలకించారు.