: ఏ రాష్ట్రం ఇలాంటి చర్యలు తీసుకున్నా నియంతృత్వానికి దారితీస్తాయి: సుజనాచౌదరి


మీడియాను నియంత్రించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అది నియంతృత్వానికి దారితీస్తుందని తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా మీడియా సంస్థలు అభ్యర్థించినప్పటికీ... ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాపాడలేదని చెప్పారు. ఇదే తీరు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అనుసరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు బాధ్యతలు ఉన్నాయని గుర్తు చేయాలని సుజనా చౌదరి అన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కానీ, ఇలా టీవీ ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షణం ఆ రెండు ఛానెళ్లను తెలంగాణలో పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News