: సానియామీర్జా నియామకంపై డా.లక్ష్మణ్ వ్యాఖ్యలు... పలువురి స్పందనలు


తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియామీర్జాను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. సానియామీర్జా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని... పైగా పాకిస్థాన్ కోడలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తాయి. పలువురు రాజకీయ ప్రముఖులు దీనిపై స్పందించారు. ఎవరెవరు ఏమన్నారో ఓ సారి చూద్దాం. మురళీమనోహర్ జోషీ, బీజేపీ సీనియర్ నేత: ఇలాంటి వ్యాఖ్యలు వారి సంస్కృతిని తెలియజేస్తాయి. ఇలాంటి వాటిపై వ్యాఖ్యానించలేను. సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నేత: ఇది కచ్చితంగా కరెక్ట్ పాయింట్. బీజేపీ కరెక్ట్ గా స్పందించింది. వి.హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను నియమించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆమె తెలంగాణకు చేసిందేమీ లేదు. పాకిస్థాన్ జాతీయుడిని పెళ్లి చేసుకుంది. ఆమె స్థానంలో మరొకరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి. నరేష్ అగర్వాల్, సమాజ్ వాదీ పార్టీ నేత: బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను నియమించడంలో తప్పేమీ లేదు. విదేశీ కోచ్ ల గురించి బీజేపీ ఎప్పుడైనా నిరసన వ్యక్తం చేసిందా? ఇది బీజేపీ సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తోంది. సానియా ఎవర్నైనా పెళ్లి చేసుకుని ఉండవచ్చు... కానీ, ఆమె భారతదేశం కోసం ఆడింది. మన దేశం గర్వించదగ్గ వ్యక్తి సానియా. కిరణ్ బేడీ, మాజీ ఐపీఎస్ అధికారిణి: సానియామీర్జా భారతమాత పుత్రిక. టెన్నిస్ ఆటతో ఆమె భారతదేశానికి ఎంతో చేసింది, ఎంతో కీర్తిని తీసుకొచ్చింది. ఆమె తప్పకుండా బ్రాండ్ అంబాసిడరే. మాయావతి, బీఎస్పీ అధినేత్రి: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాను తెలంగాణ ప్రభుత్వం నియమించడాన్ని స్వాగతిస్తున్నాం.

  • Loading...

More Telugu News