: నిద్ర కంటే ఇప్పుడు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారట!
ప్రజల ప్రాధామ్యాలు కాలంతో పాటే మారిపోతూ ఉంటాయి. తాజాగా బ్రిటన్ వాసులు మొబైల్ ఫోన్లు, టెలివిజన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. నిద్రా సమయం కన్నా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలు, రేడియోలకే అధిక సమయం వెచ్చిస్తున్నారని బ్రిటీష్ టెలికాం రెగ్యులేటర్ ఆఫ్కామ్ అంటోంది. 2010లో బ్రిటన్ వాసులు కమ్యూనికేషన్, మీడియా కోసం వెచ్చించే సగటు సమయం 8 గంటల 48 నిమిషాలు కాగా, అదిప్పుడు 11 గంటల 7 నిమిషాలకు చేరుకుంది. వారు ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ ల సాయంతో అనుసంధానమై ఉంటున్నారని ఆఫ్కామ్ పేర్కొంది. ప్రస్తుతం బ్రిటన్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం 61 శాతం ఉండగా, ఆ తర్వాత స్థానంలో ట్యాబ్లెబ్ కంప్యూటర్లు ఉన్నాయట. ఇక, రోజులో మూడుగంటల సమయం వారు టీవీ వీక్షణకు కేటాయిస్తున్నారని ఈ టెలికాం రెగ్యులేటర్ అధ్యయనంలో వెల్లడైంది.