: 'ఫాస్ట్' జీవోపై హైకోర్టులో మాజీ మంత్రి డొక్కా పిల్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫాస్ట్' పథకంపై జారీ చేసిన జీవోపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ మేరకు ఫాస్ట్ జీవోను కొట్టి వేయాలని పిటిషన్ లో కోరారు. ఫాస్ట్ పథకంతో తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఫీజు చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు 36ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని డొక్కా కోరారు. రాజ్యాంగం ప్రకారం విద్య, ఉద్యోగాల్లో సమానావకాశాలు కల్పించాల్సిన అవసరముందని వివరించారు. అలాగే విద్యార్థులకు ఫీజులు చెల్లించే ఫీజు రీయింబర్స్ మెంట్, ప్రవేశాల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే అనుసరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యం వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News