: ఎంఎస్ఓలకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు ఉంది: రాజ్యసభలో సుజనా చౌదరి
తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 చానల్స్ నిషేధంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో భాగంగా తెలుగుదేశం సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడారు. ఎంఎస్ఓలు ఈ రెండు చానల్స్ ను అన్యాయంగా నిలిపివేశారని సుజనా చౌదరి తెలిపారు. ఎంఎస్ఓలు మీడియాను తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆయన అన్నారు. మీడియాను పరోక్షంగా నియంత్రించడం మంచి పద్ధతి కాదని సుజనా చౌదరి తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని...దాన్ని ఎంఎస్ఓలు అనే ప్రైవేటు వ్యక్తులు నియంత్రించడం రాజ్యాంగవిరుద్ధమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మద్దతుతోనే ఎంఎస్ఓలు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎంఎస్ఓలకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు ఉందని మండిపడ్డారు. ప్రసారాలను నిలిపివేసే హక్కు ఎంఎస్ఓలకు లేదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని సుజనాచౌదరి పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విరుద్ధమని ఆయన అన్నారు. తెలంగాణలో మీడియాపై ఆంక్షలను ప్రతీ ఒక్కరు ఖండించాలని సుజనాచౌదరి పేర్కొన్నారు. భారతదేశంలో సొంత ఎజెండాతో పాలించే అధికారం ఎవరికీ లేదని కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు.