: సూరత్ లోని తెలంగాణ ప్రజలకు దిగులు పుట్టిస్తున్న 'సమగ్ర సర్వే'


ఈ నెల 19న తెలంగాణ వ్యాప్తంగా 'సమగ్ర సర్వే' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజున ఎవరికి ఎలాంటి పనులున్నా మానుకోవాలని... ఇంటి వద్దే ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. చివరకు పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనక పోతే చాలా నష్టాలు ఉంటాయని కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్న వారు స్వస్థలాలకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, గుజరాత్ లోని సూరత్ లో నివాసం ఉంటున్న దాదాపు 3 లక్షల మంది తెలంగాణవాసులు సొంత ఊర్లకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు టికెట్లు దొరకడం లేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని... సూరత్ నుంచి తమకు ప్రత్యేక రైళ్లు వేయించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News