: ఇరు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు ఎండలు మండుతాయ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయి. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, మేఘాలు మాయమవడంతో ఎండలు పెరుగుతున్నాయి. అయితే, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడితే... ఎండలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.