: అధికారులతో పద్నాలుగున్నర గంటల పాటు ఏకధాటిగా సమీక్షలు జరిపిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయడానికి... రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నానని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. అయితే, నిన్న మాత్రం చంద్రబాబు ఏకధాటిగా పద్నాలుగున్నర గంటల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలోని గేట్ వే హోటల్ లో కలెక్టర్లతో సమావేశానికి వచ్చిన చంద్రబాబు... రాత్రి 11.30 గంటల వరకు అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. నిన్న ఉదయం తొమ్మిది గంటలనుంచి రాత్రి పదిగంటల వరకు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. రాత్రి పదిగంటల నుంచి 11.30 గంటల వరకు పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షను నిర్వహించారు.

  • Loading...

More Telugu News