: టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు రాజీనామా చేయనున్న కనుమూరి బాపిరాజు
తిరుమల, తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి కనుమూరి బాపిరాజు నేడు రాజీనామా చేయనున్నారు. పాలకమండళ్లను రద్దు చేసేందుకు నేడో, రేపో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్స్ జారీ కాకముందే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు కనుమూరి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సోమవారానికి టీటీడీ నూతన పాలకమండలిని నియమించే అవకాశం ఉంది. ఈ క్రమంలో, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడకు టీటీడీ ఛైర్మన్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.