: టీపీసీసీ అధ్యక్షుడి మార్పు లేనట్టేనా?


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను తొలగించి కొత్త వారిని నియమిస్తారనే వార్తలు రెండు మూడు రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టడం, కాంగ్రెస్ పెద్దలను కలవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, ఇప్పటికిప్పుడే తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడిని మార్చడం అన్నది కొత్త తలనొప్పులు కొనితెచ్చుకోవడమే అవుతుందనే అభిప్రాయంలో హైకమాండ్ ఉంది. అయితే ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ విస్తృత సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ కూడా హాజరవుతున్నారు. దీంతో, టీపీసీసీ అధ్యక్షుడిపై ఆ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని... తమకు అవకాశం లభిస్తుందని ఆశావహులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News