: జానారెడ్డికి కోపం వచ్చింది
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. కాంగ్రెస్ కార్డుపై గెలిచిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంపై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద విఠల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని జానారెడ్డి చెప్పారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.