: గోల్కొండలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించడం గర్వకారణం: డిప్యూటీ సీఎం
గోల్కొండ ఖిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం గర్వకారణమని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాదులో సబ్ రిజిస్ట్రార్ల హ్యాండ్ బుక్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో నిర్వహిస్తే హిందూ, ముస్లింల సఖ్యతకు నిదర్శనంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. చారిత్రక ప్రాధాన్యమున్న గోల్కొండ కోటకు మరింత ప్రాధాన్యతనిచ్చినట్టు అవుతుందని ఆయన తెలిపారు.