: శ్రావణ శుక్రవారం సందర్భంగా గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు
శ్రావణ శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించేందుకు మహిళలు గురువారం ఉదయం నుంచే గోదావరి ఘాట్ ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పూజాసామగ్రి, బంగారం, దుస్తులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో రావడంతో రాజమండ్రి మార్కెట్లు సందడిగా మారాయి. ముఖ్యంగా దేవీచౌక్, కంబాల చెరువు, శ్యామలా సెంటర్ లోని దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది.