: నాగార్జున ఏమడిగారు?... చిరంజీవి ఏం సమాధానం చెప్పారు? నేడే ఉత్కంఠకు తెర


ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్పెషల్ షో నేడే (గురువారం) ప్రసారం కానుంది. రేపటి నుంచి 'కౌన్ బనేగా కరోడ్' పతి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ముగియనుంది. దీంతో నాగార్జున తెలుగు సినీ అభిమానులకు పసందైన కానుకను అందించనున్నారు. సహనటుడు, మెగాస్టార్ చిరంజీవిని నాగార్జున ప్రశ్నించిన మెగా షో నేటి రాత్రి 9 గంటలకు మా టీవీలో ప్రసారం కానుంది. ఈ షోలో నాగార్జున, చిరంజీవిని ఏఏ ప్రశ్నలు అడిగారు? చిరంజీవి ఎలాంటి సమాధానాలు చెప్పారు? సమకాలీనులు, స్నేహితులుగా పేరొందిన నాగార్జున, చిరంజీవి షోని ఎంత రక్తి కట్టించారో అని బుల్లితెర ప్రేమికులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ నాగార్జున చిలిపి ప్రశ్నలే వేశారా? లేక రాజకీయ సంబంధమైన ప్రశ్నలు కూడా సంధించారా? అని సినీ, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక చిరంజీవి అభిమానులు మెగాస్టార్ 150వ సినిమా ప్రకటన కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అభిమానుల అన్ని అనుమానాలకు నేటి రాత్రి తెరపడనుంది. కాగా, తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న విషయం అందరికీ తెలిసిందే.

  • Loading...

More Telugu News