: కేసీఆర్ పై లోకేష్ సెటైర్లు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ కార్యకర్తల నిధినిర్వహణ చైర్మన్ లోకేష్ మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆరంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రులంతా అభివృద్ధి చేసిన హైదరాబాదులో కేసీఆర్ ఏదో చేస్తున్న భ్రమలు కల్పించి, సవాళ్లు విసరడం సరి కాదని హితవు పలికారు. ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, కంపెనీలు, నిధులు, పన్ను రాబడులు, నీళ్లు, ప్రాజెక్టులపై శ్వేత పత్రాలు విడుదల చేసిన తరువాత, కేసీఆర్ మాట్లాడితే బాగుంటుందని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో అభివృద్ధిలో పోటీపడితే అప్పుడు కేసీఆర్ మాటలు చెల్లుబాటు అవుతాయని లోకేష్ సూచించారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు రాష్ట్రం తీరుతెన్నులపై అవగాహనలేని కేసీఆర్ ఏదో ఒకటి మాట్లాడి, వివాదం రేపి తెలంగాణ ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా కేసీఆర్ నిరూపించుకోవాలని ఆయన విమర్శించారు. అధికారం చేపట్టి రెండు నెలలు కాకుండానే రైతులపై లాఠీఛార్జ్, ఉస్మానియా విద్యార్థులపై దౌర్జన్యాలు తప్ప కేసీఆర్ తెలంగాణకు చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడికెళ్తే అక్కడ హామిలివ్వడం కాకుండా కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని లోకేష్ నిలదీశారు.

  • Loading...

More Telugu News