: షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష: కేంద్ర ప్రభుత్వం
ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 24న జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (గురువారం) పార్లమెంటులో ప్రకటించింది. అభ్యర్థుల అభ్యంతరాల కారణంగా పరీక్షను వాయిదా వేసే అవకాశం ఏమాత్రం లేదని రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ అంశంపై క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని, సీశాట్ పై రాజకీయపార్టీలు, ఇతర అధికారులతో చర్చించి వాదనలు వినాల్సి ఉందని తెలిపారు. కాగా, సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశంపై చర్చించి ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య చెప్పారు. అయితే, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సీశాట్ పై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.