: ఆర్మూరులో రూ.114 కోట్లతో తాగునీటి పథకానికి కేసీఆర్ శంకుస్థాపన


నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో 114 కోట్ల రూపాయలతో తాగునీటి పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆర్మూరులో తాగునీటిని శుద్ధి చేసే పథకాన్ని సంవత్సరంలోగా తీసుకువస్తామని ఆయన చెప్పారు. అనంతరం అక్కడ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ... ఆటో రిక్షాలకు ఇప్పటికే రవాణా పన్ను రద్దు చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పేదలకు 3.5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ఆయన తెలిపారు. ఆర్మూరులో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News