: హైదరాబాద్ పోలీసులకు 'మర్యాద' పాఠాలు షురూ
హైదరాబాద్ పోలీసుల ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చేందుకు గాను... ఫ్రెండ్లీ పోలీసింగ్ శిక్షణా తరగతులను బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీలో డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పోలీసులపై ప్రజల్లో ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించి... సామాన్యజనాలకు మరింత చేరువవ్వాలని ఆయన పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పోలీసులకు 'మర్యాద పాఠాలు' నేర్పేందుకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని సామాన్య పౌరులతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి... స్టేషన్ కు వచ్చినవారితో మర్యాదగా ఎలా మాట్లాడాలి... బాడీలాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలనే దానిపై సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ ఫర్ట్స్ తో పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు.