: మిజోరాం గవర్నర్ ను పదవి నుంచి తొలగించడంపై విమర్శలు
మిజోరాం గవర్నర్ పదవి నుంచి కమలా బేణివాల్ ను కేంద్ర ప్రభుత్వం తొలగించడంపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శల దాడికి దిగాయి. రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్ ను తొలగించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. అటు ఈ అంశంపై జేడీయూ స్పందిస్తూ, ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొంది. వీటిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఆరోపణలు ఉండడం వలనే కమలా బేణివాల్ ని తొలగించామని, గవర్నర్ తొలగింపులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు.