: కలెక్టర్లతో తొలిసారి సమావేశమైన చంద్రబాబు
రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి సమావేశమయ్యారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో వీరి సమావేశం ప్రారంభమయింది. 7 ప్రాధాన్యత గల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు సంబంధిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశంలో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు.