: పాక్ 'ఫేక్' యువతితో ఛాటింగ్ ఆర్మీ అధికారి కొంప ముంచింది


పాక్ యువతితో అనుమతి లేకుండా ఫేస్ బుక్ ఛాటింగ్ చేసిన ఆర్మీ అధికారి పతక్ కుమార్ తోతర్ ను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. అనుష్క అగర్వాల్ అనే యువతితో రెండేళ్లుగా ఛాటింగ్ చేస్తున్న పతక్ కుమార్, ఆమెకు స్థానిక అధికారుల ఫోన్ నెంబర్లు, మ్యాపులు అందజేసినట్టు ఆర్మీ అధికారులు ఆరోపిస్తున్నారు. అతని అకౌంట్ లో పెద్దఎత్తున డబ్బు జమ చేసినట్టు అధికారులు గుర్తించారు. రెండు రోజుల కింద అందిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు అనుష్క అగర్వాల్ ది ఫేక్ ఐడీ అని గుర్తించారు. కాగా, కంటోన్మెంట్ లో సుబేదార్ మేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న పతక్ కుమార్ తోతర్ ను పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News