: 'పీకే' పోస్టర్లు... కాపీ కొట్టి రూపొందించారు!
అమీర్ ఖాన్ నగ్నావతారంతో 'పీకే' చిత్రానికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అమీర్ బట్టలిప్పుకుని, కటి భాగాన్ని ఓ టూ-ఇన్-వన్ సాయంతో కవర్ చేసుకుంటున్నట్టున్న పోస్టర్లు సంచలనం సృష్టించాయి. అయితే, ఆ దిగంబర విన్యాసం గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. పీకే బృందం ఆ భంగిమను ఓ పోర్చుగల్ గాయకుడి ఆల్బమ్ కవర్ పేజీ నుంచి నుంచి కాపీ కొట్టింది. ఆ సింగర్ పేరు క్విమ్ బర్రీరాస్. ఎప్పుడో 1973లో తన మ్యూజిక్ ఆల్బమ్ కవర్ కోసం ఆ న్యూడ్ పోజిచ్చాడు బర్రీరాస్. రెండింటికి తేడా ఏమిటంటే... బర్రీరాస్ తన కటిభాగాన్ని ఓ సంగీత పరికరంతో కవర్ చేస్తే, అమీర్ ఓ టూ-ఇన్-వన్ తో కప్పేసుకున్నాడు, అంతే! మిగతాదంతా సేమ్ టు సేమ్! కాగా, అమీర్ చిత్రానికి ఇలా పరభాషల పోస్టర్ల నుంచి స్ఫూర్తినొందడం ఇదే తొలిసారి కాదండోయ్. ఇంతకుముందు సూపర్ హిట్ చిత్రం గజినీకి సైతం ఇలాగే కాపీ కొట్టి పోస్టర్లు తయారుచేశారు. అప్పుడు హాలీవుడ్ చిత్రం 'హల్క్' నుంచి పోస్టర్ థీమ్ ను లిఫ్ట్ చేశారు.