: వాళ్ళిద్దరూ భారత్ లోనే స్టార్ క్రికెటర్లు, ఇంగ్లండ్ లో కాదు: డేవిడ్ లాయిడ్


ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ లాయిడ్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలపై విమర్శల దాడికి దిగాడు. ధోనీ, జడేజా భారత్ లోనే సూపర్ స్టార్లని, ఇంగ్లండ్ లో కాదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ కు లాయిడ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళిద్దరిపై సౌతాంప్టన్ ప్రేక్షకులు కరుణ చూపారని, మాంచెస్టర్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఎదురవుతుందని చెప్పాడు. ఇక్కడి ప్రేక్షకుల చేతిలో వారికి చేదు అనుభవాలు తప్పవని హెచ్చరించాడు. మాంచెస్టర్ లోని ఓల్ట్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు రేపటి నుంచి జరగనుంది.

  • Loading...

More Telugu News