: నీటిలో ఉండాల్సింది సైకిల్ స్టాండ్ వద్ద ప్రత్యక్షమైంది!
కాన్పూర్ జూలో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఓ మొసలి నీటిలోంచి వెలుపలికి వచ్చి సైకిల్ స్టాండ్ వద్ద ప్రత్యక్షమైంది. దీంతో, సిబ్బంది సహా అందరూ బెంబేలెత్తిపోయారు. ఎనిమిదడుగుల పొడవున్న ఈ భారీ సరీసృపాన్ని బంధించేందుకు జూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఓ పెద్ద వల తెచ్చినా, ఆ ప్రయత్నం విఫలమైంది. చివరికి కర్రలు, తాళ్ళ సాయంతో దానిని నీటిలోకి మళ్ళించారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం జరిగింది ఈ ఘటన.