: గోల్కొండ ఖిల్లాలో పోలీసుల కవాతు


గ్రేటర్ హైదరాబాదులోని గోల్కొండ ఖిల్లాలో పోలీసులు కవాతు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులు గోల్కొండ కోటను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకల కోసం పోలీసు బలగాలు కోటలో రిహార్సల్స్ చేశాయి. కాగా, ప్రతి ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో జరపాలని టీఎస్ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

  • Loading...

More Telugu News