: రుణమాఫీపై వెనక్కి తగ్గం... ఆర్బీఐ తో 'ఢీ' అంటున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు


రుణమాఫీపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించినప్పటికీ... ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ మాటలకు భయపడవద్దని రైతులకు ఈ రెండు ప్రభుత్వాలు సూచించాయి. కేవలం పై-లిన్ తుఫాను కారణంగానే తాము రైతు రుణమాఫీలు చేయడంలేదని... గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడం లేదని, అందుకే రుణమాఫీ చేయాలని నిర్ణయించామని అంటున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐ కు క్షేతస్థాయిలో రైతుల కష్టాలు తెలియవని అంటోంది. త్వరలోనే తాము పైలిన్ తుఫాను వల్ల నష్టపోయిన పంటల ఫోటోలు, వీడియోలు చూపించి ఆర్బీఐను ఒప్పిస్తామని టీఎస్ సర్కార్ అంటోంది. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆర్బీఐకి ఇప్పటికే ఓ ఘాటు లేఖను కూడా పంపించింది. గత సంవత్సరం వచ్చిన ఒక్క పై-లిన్ తుఫాను గురించే ఆర్బీఐ ఎందుకు మాట్లాడుతోందని ఈ లేఖలో టీడీపీ సర్కార్ ప్రశ్నించింది. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో సకాలంలో ఎప్పుడూ వర్షాలు పడలేదని ఈ లేఖలో పేర్కొంది. వరుస తుపానులు కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్రమైన కష్టాలను మిగిల్చాయని తెలిపింది. 2010 లైలా తుఫాను రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చిందని... అలాగే 2011లో వర్షాలు పడక రాష్ట్రంలో తీవ్రమైన కరవు వచ్చిందని లేఖలో పేర్కొంది. ఇక 2012లో నీలమ్ తుఫాను రైతుల పంటలను పూర్తిగా నాశనం చేసిందని... 2013 లో ఫై-లిన్ తుఫానుతో పాటు లెహర్, హెలెన్ తుఫానులు రాష్ట్రంలోని రైతులోకాన్ని అతలాకుతలం చేశాయని ఏపీ సర్కార్ ఆర్బీఐకి లేఖలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News