: విజయవాడకు త్వరలో డబుల్ డెక్కర్ రైలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన నగరంగా ఉన్న విజయవాడకు త్వరలో డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న (మంగళవారం) ఇక్కడి స్టేషన్ లోని 1, 2, 3, 4 ఫ్లాట్ ఫారాలపై మధ్యాహ్నం సమయంలో అధికారులు డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్ ను మూడు గంటల పాటు నిర్వహించారు. ఈ రోజు ఉదయం కూడా 8, 9, 10 ఫ్లాట్ ఫారాలపై నడిపి పరిశీలిస్తారు. అంటే రైలును విజయవాడ వరకు నడిపితే ఫ్లాట్ ఫారాలు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలుసుకునేందుకే పరిశీలించారు. ఈ క్రమంలోనే విజయవాడకు డబుల్ డెక్కర్ రైలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం డబుల్ డెక్కర్ రైలును కాచిగూడ-తిరుపతి మార్గంలో వారానికి రెండు రోజులు నడుపుతున్నారు. విజయవాడ-కాచిగూడ మార్గంలోనూ నడపాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు రైల్వే బోర్డుకు కొంతకాలంగా ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెజవాడ మార్గంలోనూ రైలు నడిపే అవకాశం ఉందని అంటున్నారు.

  • Loading...

More Telugu News