: మా కౌన్సిలింగును మేమే నిర్వహించుకుంటాం: టీఎస్ మంత్రి


ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కుదురు లేకుండా చేస్తోంది. కౌన్సిలింగ్ ప్రక్రియను ఆగస్ట్ 31లోగా ముగించి... సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ... ఈ విషయంపై పీటముడి మరింత బిగిసేలా కనిపిస్తోంది. తాజాగా నిన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తమ కౌన్సిలింగ్ ను తామే నిర్వహించుకుంటామని, పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి జగదీశ్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులకు ఒక్క రోజు చదువు కూడా నష్టం కలగకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంసెట్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ అతి మూర్ఖంగా, అతితెలివిగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణపై ఉన్నత విద్యామండలి పెత్తనాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. తమ అంగీకారం లేకుండా... ఉన్నత విద్యామండలి సర్టిఫికెట్ల పరిశీలన జరపలేదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News